సముద్రంలో ఉండాల్సిన చేప తెలంగాణ చెరువులో ప్రత్యక్షం!
- నల్లని చారలతో ఉన్న వింత చేప
- ఖమ్మం జిల్లా చెరువులో వలకు చిక్కిన చేప
- కొత్త చేపను చూసేందుకు స్థానికుల ఆసక్తి
నల్లని చారలతో విచిత్రంగా కనిపించే సముద్ర జాతి చేప తెలంగాణలోని ఓ చెరువులో కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఉన్న నర్సింహులగూడెం గ్రామం వద్ద ఉన్న చెరువులో ఈ చేప లభ్యమైంది. డేగల వీరయ్య అనే జాలరి చెరువులో చేపల వేట సాగిస్తుండగా, ఈ చేప వలకు చిక్కింది.
సాధారణంగా దొరికే మంచినీటి చేపలకు భిన్నమైన రంగు, ఆకారంతో ఉన్న ఆ చేపను చూసి వీరయ్య ఆశ్చర్యపోయాడు. స్థానికులు కూడా ఎప్పుడూ చూడని ఈ వింత చేపను చూసేందుకు విపరీతమైన ఆసక్తి ప్రదర్శించారు. ఈ చేప శాస్త్రీయనామం టెరిగోప్లిక్తిస్ పారడాలిస్. ఇది ప్రధానంగా దక్షిణ అమెరికా దేశాల సముద్ర జలాల్లో ఉంటుంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది.