రైతుల కన్నీళ్లలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం: కళా వెంకట్రావు
- మూడు రాజధానుల విధానం విమర్శపాలైందన్న కళా
- వికేంద్రీకరణ అంటే ఏంటో జగన్ తెలుసుకోవాలని హితవు
- ప్రజలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారంటూ ఆగ్రహం
టీడీపీ అగ్రనేత కళా వెంకట్రావు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. జగన్ తీసుకువచ్చిన మూడు రాజధానులు విధానం దేశవ్యాప్తంగా విమర్శలపాలైందని అన్నారు. ప్రజల జీవితాలతో ఆటలాడుకునే హక్కు మీకెవరిచ్చారంటూ ప్రశ్నించారు. రైతుల కన్నీళ్లలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో జగన్ తెలుసుకోవాలని కళా వెంకట్రావు హితవు పలికారు. అమరావతి అజెండాతో ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, మూడు రాజధానులతో ఎన్నికలకు వెళ్లేందుకు మీరు సిద్ధమా అంటూ అధికార వైసీపీని ప్రశ్నించారు.