టీడీపీనీ దెబ్బతీయడం కోసమే ఐదు కోట్ల మంది జీవితాలను జగన్ బలిపెడుతున్నారు: అనగాని సత్యప్రసాద్

  • ప్రజలందరి ఏకాభిప్రాయంతో రాజధాని ఏర్పాటైందని వెల్లడి
  • ఎవరిని అడిగి రాజధాని మార్చుతున్నారన్న అనగాని
  • మూడు రాజధానుల నిర్ణయం ఆచరణ సాధ్యంకాదని వ్యాఖ్యలు
ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలందరి ఏకాభిప్రాయంతో అమరావతి రాజధానిగా ఏర్పాటైందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పుడు జగన్ ఎవరిని అడిగి రాజధాని మార్చుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు రాజీనామాలు చేస్తే మళ్లీ గెలుస్తామన్న నమ్మకం కాదు, కనీసం డిపాజిట్లు కూడా వస్తాయన్న ఆశ లేదని, అందుకే వైసీపీ నేతలెవరూ రాజీనామాలపై నోరు మెదపడంలేదని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ తప్ప మిగిలిన పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కేవలం టీడీపీని దెబ్బతీయడం కోసమే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును జగన్ బలిపెడుతున్నారని సత్యప్రసాద్ ఆరోపించారు. 


More Telugu News