తీవ్రమైన అపస్మారక స్థితిలోకి ప్రణబ్ ముఖర్జీ!
- ఈ నెల 10 నుంచి ఆసుపత్రిలోనే
- వెంటిలేటర్ సపోర్ట్ కొనసాగుతోంది
- ఇన్ఫెక్షన్ కు చికిత్స చేస్తున్నామన్న వైద్యులు
ఈ నెల 10వ తేదీ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన తీవ్రమైన అపస్మారక స్థితిలో ఉన్నారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
అయితే, వైటల్ పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని తెలిపాయి. ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ కొనసాగుతోందని పేర్కొన్న వైద్యులు, ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ కు చికిత్స చేస్తున్నామని వెల్లడించారు. కాగా మెదడులో రక్తం గడ్డకట్టగా, దానికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు ప్రణబ్ ఆసుపత్రికి వెళ్లగా, ఆయనకు కరోనా కూడా సోకినట్టు నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉండగా, ఆరోగ్యం క్రమంగా విషమిస్తోంది.