నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ రోగులకు చికిత్స.. ఏలూరులో ప్రైవేటు ఆసుపత్రి సీజ్

  • ఒక్కో రోగి నుంచి లక్ష రూపాయలకు పైగా ఫీజు వసూలు
  • ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేసిన వైద్య, రెవెన్యూ, పోలీసు అధికారులు
  • అక్కడి రోగులు మరో ఆసుపత్రికి తరలింపు
నిబంధనలకు విరుద్ధంగా కరోనా రోగులకు చికిత్స చేస్తుండడమే కాక, అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్న ఓ ప్రైవేటు ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. కొవిడ్ చికిత్సకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకున్నా నగరంలోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి చికిత్స చేస్తుండడమే కాక, రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి.

స్పందించిన జిల్లా వైద్యాధికారులు, రెవెన్యూ, పోలీసులు అధికారులు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నట్టు, ఒక్కో రోగి నుంచి లక్ష రూపాయలకు పైగా వసూలు చేస్తున్నట్టు విచారణలో తేలడంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. అప్పటికే అక్కడ చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులను మరో ఆసుపత్రికి తరలించారు.


More Telugu News