పాడేరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగులతో థింసా నృత్యాలు చేయించిన వైద్యులు
- పాడేరు ఆసుపత్రిలో కరోనా రోగుల డ్యాన్సులు
- రోగుల్లో ఆశావహ దృక్పథం ఉండాలన్న వైద్యులు
- అప్పుడే త్వరగా కోలుకుంటారని వెల్లడి
విశాఖ జిల్లా పాడేరు ప్రభుత్వాసుపత్రిలో వినాయకచవితి సందర్భంగా ఉల్లాసకరమైన దృశ్యాలు కనిపించాయి. కరోనా వంటి రాకాసి వైరస్ బారినపడినా, మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు కరోనా పాజిటివ్ రోగులు ఇక్కడి ఆసుపత్రిలో డ్యాన్సులు చేశారు. వైద్యులు వారితో థింసా నృత్యంతో పాటు పలు జానపద గీతాలకు నృత్యం చేయించారు. రోగుల్లో ఆశావహ దృక్పథం పెంపొందించే దిశగా వైద్యులు కరోనా రోగులను డ్యాన్సులు చేయాలంటూ ఉత్సాహపరిచారు. అంతేకాదు, తాము సైతం రోగులతో కలిసి నర్తించారు. ఆనందంతోనే కరోనాను అధిగమించవచ్చని వైద్యులు పేర్కొన్నారు.