ఆకాశంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువులు... వీడియో తీసిన రష్యన్ వ్యోమగామి

  • మరోసారి చర్చనీయాంశమైన యూఎఫ్ఓలు
  • ధృవ ప్రాంతాల్లో సంచారం!
  • వీడియోను విశ్లేషిస్తున్న రష్యన్ అంతరిక్ష సంస్థ
ఫ్లయింగ్ సాసర్లు, యూఎఫ్ఓ (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్)లు, ఏలియన్స్ గురించిన చర్చ ఈనాటిది కాదు. ఆకాశంలో తాము విచిత్రమైన వస్తువులను, ఆకారాలను చూశామని గతంలో ఎంతోమంది చెప్పారు. అయితే, వీటికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలను మాత్రం ఎవరూ చూపించలేకపోయారు. ఇటీవల నాసా కొన్ని వీడియోలను విడుదల చేయడంతో వీటిపై ఆసక్తి మరింత పెరిగింది. అవి నిజమేనేమో అన్న భావన కలుగుతోంది. తాజాగా రష్యన్ వ్యోమగామి తీసిన వీడియోలో ఐదు గుర్తుతెలియని ఎగిరే వస్తువులు దర్శనమిచ్చాయి.

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో ఉన్న రష్యా వ్యోమగామి ఇవాన్ వాగ్నర్ ధృవ ప్రాంతాల్లోని అరోరా బొరియాలిస్ దృశ్యాలను వీడియో తీస్తుండగా, అకస్మాత్తుగా కొన్ని యూఎఫ్ఓలు కెమెరా రేంజ్ లోకి వచ్చాయి. ఒకే వరుసలో ప్రయాణిస్తున్న వాటిని ఆయన చిత్రీకరించారు. ఇప్పుడీ వీడియో శాస్త్ర సాంకేతిక రంగంలోని నిపుణులను కూడా ఎంతో ఆకర్షిస్తోంది. వాగ్నర్ తీసిన వీడియోను రష్యా అంతరిక్ష సంస్థ విశ్లేషిస్తోంది.



More Telugu News