బీజేపీకి సలహాలు ఇచ్చే స్థాయి రఘురామకృష్ణరాజుకు లేదు: విష్ణువర్ధన్ రెడ్డి

  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి
  • వేరేవాళ్లు రఘురామకు పనులు అప్పగించారన్న ఏపీ బీజేపీ డిప్యూటీ
  • ఆ పనులు చూసుకోవాలంటూ వ్యాఖ్యలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి సలహాలు ఇచ్చే స్థాయి రఘురామకృష్ణరాజుకు లేదని స్పష్టం చేశారు. వేరే వాళ్లు కొందరు రఘురామకృష్ణరాజుకు చాలా పనులు అప్పగించారని, ఆయన ఆ పనులు చూసుకుంటే మంచిదని అన్నారు. మీరు ఆ పనుల్లో బిజీగా ఉండండి... రాష్ట్రంలో ఏంచేయాలో మాకు తెలుసు, మేం చూసుకుంటాం అని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, టీడీపీ నేతలపైనా ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఓవైపు మోదీని పొగుడుతూ, మరోవైపు ఎమ్మెల్యేలతో తిట్టిస్తున్నారని, ఇది నీచ రాజకీయం అని విమర్శించారు. ఏపీలో ప్రతిపక్షంగా విఫలమైన టీడీపీ ఇప్పుడు కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టీడీపీ ఎందుకు భయపడుతోందో ప్రజలకు తెలుస్తోందని అన్నారు.


More Telugu News