కరోనా ఎఫెక్ట్.. నిబంధనలను పూర్తిగా మార్చేసిన ఎన్నికల కమిషన్!
- సామాజిక దూరం, గ్లవ్స్ కంపల్సరీ
- కోవిడ్ నిబంధనలన్నీ పాటించాలి
- నామినేషన్, సెక్యూరిటీ డిపాజిట్లు ఆన్ లైన్లోనే
కరోనా వైరస్ ప్రపంచ స్థితిగతులను మార్చేసింది. మన దేశంలో సైతం ఎన్నో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చివరకు ఎన్నికల నిబంధనలు కూడా మారిపోతున్నాయి. ఎన్నికల సంఘం కొన్ని కొత్త నిబంధనలను విధించింది.
ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని ఈసీ తెలిపింది. ఓటు వేసే సమయంలో ఓటర్లు సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పింది. ఓటర్లందరికీ గ్లవ్స్ ఇవ్వాలని... ప్రతి ఓటరు గ్లవ్స్ ధరించి ఈవీఎం బటన్ ను నొక్కాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని పేర్కొంది. పబ్లిక్ మీటింగులు, రోడ్ షోలను నిర్వహించుకోవచ్చని... అయితే, కేంద్ర హోంశాఖ విధించిన కోవిడ్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని ఆదేశించింది.
అభ్యర్థులందరూ నామినేషన్లను ఆన్ లైన్లో దాఖలు చేయాలని ఈసీ తెలిపింది. సెక్యూరిటీ డిపాజిట్ ను కూడా ఆన్ లైన్లోనే చెల్లించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో మాస్కులు, శానిటైజర్లు ఉండాలని చెప్పింది. థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉండాలని తెలిపింది.