సోషల్ నెట్వర్కింగ్ సైట్ల నుంచి వెల్లువలా డేటా లీకేజి!

  • లీకేజి గురించి వెల్లడించిన కంపారిటెక్ వెబ్ సైట్
  • లీకైన డేటాలో యూజర్ల ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు
  • డార్క్ వెబ్ చేతిలో లీకైన డేటా!
యూట్యూబ్, టిక్  టాక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల నుంచి భారీ స్థాయిలో వినియోగదారుల డేటా లీకైనట్టు వెల్లడైంది. కంపారిటెక్ అనే వెబ్ సైట్ ఎడిటర్ పాల్ బిస్చెఫ్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. లీకైన డేటాలో యూజర్ల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు, ప్రొఫైల్ చిత్రాలు ఉన్నట్టు తెలిపారు.

తొలుత ఇన్ స్టాగ్రామ్ నుంచి రెండు విడతల్లో డేటా లీకైందని, ఈ సమయంలో 100 మిలియన్ల మందికి చెందిన డేటా పరుల పాలైందని, ఆ తర్వాత యూట్యూబ్ నుంచి 4 మిలియన్ల మందికి చెందిన సమాచారంతో పాటు టిక్ టాక్ నుంచి 42 మిలియన్ల మందికి సంబంధించిన సమాచారం లీకైందని బిస్చెఫ్ వివరించారు. ఈ డేటా యావత్తు డార్క్ వెబ్ కు చేరినట్టు భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ డేటా సైబర్ నేరగాళ్లకు, స్పామర్లకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.


More Telugu News