ఇస్రో ప్రైవేటు పరం అవుతోందనే వార్తలపై ఛైర్మన్ శివన్ స్పందన
- ఈ వార్తల్లో నిజం లేదు
- ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తాం
- తాజా సంస్కరణలతో ఇస్రో కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ప్రైవేట్ పరం చేస్తారనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇస్రో ఛైర్మన్ కె.శివన్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఇస్రోలో చేపడుతున్న సంస్కరణలు ప్రైవేటు పరం చేయడానికి కాదని తెలిపారు. అయితే ఇస్రో చేస్తున్న పనుల్లో ప్రైవేటు సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. దీంతో ఇస్రో కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని అన్నారు.
అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేయడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోందని చెప్పారు. మన దేశంలో కూడా అంతరిక్ష పరిశోధనా రంగంలో స్టార్టప్ సంస్థలు ఉన్నాయని తెలిపారు. అయితే వాటికి సాంకేతిక సహకారం అందించే వ్యవస్థ మన వద్ద లేదని ... అందుకే సంస్కరణల రూపంలో దీనికి పరిష్కారాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు.