'ఎలాంటి మార్పు లేదు'.. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి బులిటెన్
- న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స
- వెంటిలేటర్‌పైనే ప్రణబ్
- చికిత్స అందిస్తోన్న ప్రత్యేక వైద్య నిపుణుల బృందం
న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చికిత్స నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనాతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ జరిగింది. ఆ తర్వాత నుంచి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంది.
ఈ క్రమంలో ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి ఈ రోజు బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అందులో వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వారు వివరించారు. అలాగే, ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన శరీరంలోని కీలక అవయవాలకు సంబంధించిన పనితీరును గురించి ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది.