శ్రీశైలం ప్రమాదంపై అనుమానాలు.. కుట్రేమోనని డౌట్: రేవంత్‌రెడ్డి

  • శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో గతరాత్రి పేలుడు
  • జగన్ జలదోపిడీకి సహకరిస్తూ విద్యుత్ ప్రాజెక్టులను నాశనం చేస్తున్నారు
  • సీబీఐతో విచారణ జరిపించాలి
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. అది ప్రమాదం కాదేమోనని, కుట్రని అనుమానంగా ఉందని అన్నారు. తాజా పరిణామం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతోందేమోనని అనుమానంగా ఉందని రేవంత్ అన్నారు.

 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జల దోపిడీకి సహకరించి రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందు నుంచి తాము చెబుతూనే ఉన్నామన్నారు. ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాతాళగంగలో ఉన్న ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో గత రాత్రి పదిన్నర గంటల సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఆరు టన్నెళ్లలో నాలుగు పేలిపోయాయి. విధుల్లో ఉన్న 12 మంది కార్మికుల్లో ఆరుగురు మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.


More Telugu News