ఒత్తిడికి తలొగ్గుతున్న రష్యా.. వ్యాక్సిన్‌కు మూడో దశ ప్రయోగాలు నిర్వహించాలని యోచన
- అందరికంటే ముందే టీకాను విడుదల చేసిన రష్యా
- హడావిడిగా విడుదల చేసిందన్న విమర్శలు
- 40 వేల మందిపై మూడో దశ ప్రయోగాలకు సిద్ధం
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని మిగతా దేశాల కంటే ముందే రష్యా ‘స్పుత్నిక్-వి’ పేరిట వ్యాక్సిన్ ని విడుదల చేసి సంచలనం సృష్టించింది. అయితే, పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించకుండా ఆగమేఘాల మీద ఈ టీకాను తీసుకొచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం రెండు దశల ప్రయోగాలు మాత్రమే చేసి మార్కెట్లోకి విడుదల చేయడం సరికాదని ప్రపంచ దేశాలు ఆక్షేపించాయి. దీంతో ఆలోచనలో పడిన రష్యా.. అడ్వాన్స్‌డ్ ట్రయల్స్ (మూడో దశ ప్రయోగం) కూడా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రపంచ దేశాల ఒత్తిడితో దిగొచ్చిన రష్యా తాను అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వి’ని మూడో దశలో భాగంగా 40 వేల మంది వలంటీర్లపై ప్రయోగించాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు, రష్యా వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలపై తమకు సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకటనతో వివిధ దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఏం చేయాలో పాలుపోని రష్యా.. మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.