మిత్రా మోటార్స్ అగ్ని ప్రమాదానికి కారణం ఎలుకే.. స్పష్టం చేసిన ఫోరెన్సిక్ సంస్థ
- ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రమాదం
- షార్ట్ సర్క్యూటే కారణమంటూ కేసును మూసేసిన పోలీసులు
- మండుతున్న దీపం వొత్తిని లాక్కెళ్లి కుర్చీపై వేసి ప్రమాదానికి కారణమైన ఎలుక
హైదరాబాద్, ముషీరాబాద్‌లోని ‘మిత్రా మోటార్స్’లో ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన అగ్నిప్రమాదానికి ఓ చిన్న ఎలుక కారణమని ఫోరెన్సిక్ సంస్థ విచారణలో వెల్లడి కావడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. మిత్రా మోటార్స్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన అగ్నిప్రమాదంలో మూడు కార్లు, ఫర్నిచర్ కాలిబూడిదయ్యాయి. దాదాపు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమంటూ కేసును మూసివేశారు. అయితే, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని, ఓ ఎలుకే నిప్పు పెట్టిందని ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సంస్థ విచారణలో బయటపడింది. సీసీటీవీ ఫుటేజీలను గమనించిన అనంతరం ఈ విషయాన్ని నిర్ధారించింది. దాదాపు ఆరు నెలల తర్వాత ప్రమాదానికి గల అసలు కారణం తెలియడం గమనార్హం.
ఫిబ్రవరి ఏడో తేదీన ఉదయం 10 గంటల సమయంలో కంపెనీ ఉద్యోగి ఒకరు దేవుడి పటం ముందు దీపం వెలిగించి పూజ చేశాడు. ఆ గదిలోకి గాలి అంతగా ప్రసరించే అవకాశం లేకపోవడంతో ఆ దీపం రాత్రి వరకు వెలుగుతూనే ఉంది. రాత్రి 11:51 గంటల సమయంలో ఓ ఎలుక నిప్పులాంటి వస్తువును పట్టుకుని టేబుల్‌పై కనిపించింది. దాని నోటిలో ఉన్నది దీపం వొత్తేనని నిర్ధారించారు. ఆ తర్వాత ఆ వొత్తిని అది కుర్చీపై జారవిడిచింది.
ఆ కుర్చీలు రివాల్వింగ్ చైర్లు కావడం, స్పాంజ్ వంటి తొందరగా అంటుకునే గుణం ఉండడంతో వెంటనే మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఎగసిపడి కింది ఫ్లోర్‌లోకి ప్రవేశించాయి. అక్కడ ఫర్నిచర్‌తోపాటు మరమ్మతు కోసం ఉంచిన మూడు కార్లు కాలి బూడదయ్యాయి. ఓ చిన్న ఎలుక ఇంతటి ప్రమాదానికి కారణమైందన్న విషయం తెలిసి అందరూ విస్తుపోతున్నారు.