స్వర్ణప్యాలెస్ ఘటనలో సమాచారమిస్తే బహుమతి ఇస్తారా? ఇందులో లాడెన్ గ్రూపువాళ్లు, ఉగ్రవాదులేమైనా ఉన్నారా?: వర్ల రామయ్య
- విజయవాడ స్వర్ణప్యాలెస్ హోటల్లో అగ్నిప్రమాదం
- దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం
- ఇందులో బలయ్యే మేకలు ఎవరో అంటూ వర్ల ట్వీట్
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుల ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య తనదైన శైలిలో స్పందించారు. "స్వర్ణ ప్యాలెస్ హోటల్ దుర్ఘటనలో సమాచారం అందిస్తే ప్రభుత్వం లక్ష రూపాయల బహుమతి ఇస్తుందా? ఏమి సార్... ఈ ఘటనలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, బిన్ లాడెన్ గ్రూపువాళ్లు ఏమైనా ఉన్నారా? ఈ కేసు దర్యాప్తు రాష్ట్ర ప్రజలకు చాలా ఆసక్తి కలిగిస్తోంది. చివరకు ఇందులో బలయ్యే మేకలు ఎవరో?" అంటూ ట్వీట్ చేశారు.