భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం... అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం

  • గత రాత్రి 43 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం
  • ఈ ఉదయానికి 45.8 అడుగులకు చేరిక
  • ఈ రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
భారీ వర్షాల కారణంగా పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో గోదావరి ఇంకా ప్రమాదకర స్థితిలోనే ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద మళ్లీ నీటిమట్టం అధికమవుతోంది. నిన్న తగ్గినట్టు అనిపించిన వరద ప్రవాహం ఇవాళ ఉదయం పెరిగింది. కొన్ని గంటల వ్యవధిలోనే 43 అడుగుల నుంచి 45.8 అడుగులకు చేరుకుంది. ఈ రాత్రికి గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరుతుందని కేంద్ర జల్ శక్తి శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే కేంద్రం జిల్లా కలెక్టర్ ను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ రాత్రికి వరద నీరు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరద పోటెత్తుతున్న నేపథ్యంలో భద్రాచలం నుంచి హైదరాబాదు, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు.


More Telugu News