శ్రీశైలం డ్యామ్ కు పోటెత్తుతున్న వరద.. ఐదు గేట్ల ఎత్తివేత!

  • శ్రీశైలం జలాశయానికి 4,29,522 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
  • 883.30 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
  • ఐదు గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. దీంతో, కృష్ణాపై ఉన్న జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో, పైనుంచి శ్రీశైలం డ్యామ్ కు వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 4,29,522 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... 2,70,423 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. జలాశయం పూర్తి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 883.30 అడుగులకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో అధికారులు డ్యామ్ ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పాదన కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జునసాగర్ కు చేరుకుంటోంది.


More Telugu News