బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చంద్రబాబు, హరీశ్ రావు ఆందోళన
- దేశమంతా ఆందోళన చెందుతోందన్న చంద్రబాబు
- ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
- కొన్ని దశాబ్దాలుగా అలరిస్తోన్న గొప్ప గాయకుడన్న హరీశ్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. 'బాల సుబ్రహ్మణ్యంగారి ఆరోగ్యం గురించి ప్రాంతాలకు, భాషలకు అతీతంగా దేశమంతా ఆందోళన చెందుతోంది. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
'తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు ఇతర భాషల్లో పాటలు పాడి కొన్ని దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తోన్న గొప్ప గాయకుడు బాలసుబ్రహ్యణ్యం త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను' అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. కాగా, బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.