నేడు కూడా స్వల్పంగా పెరిగిన పెట్రోలు ధరలు!
- వరుసగా ఆరవ రోజూ పెరిగిన ధరలు
- లీటరుపై పది పైసల పెంపు
- ఢిల్లీలో రూ. 81 దాటిన ధర
పెట్రోలు ధరలు వరుసగా ఆరవ రోజు కూడా పెరిగాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలుపై 10 పైసల మేరకు ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. ఇదే సమయంలో గత రెండు వారాలుగా డీజిల్ ధర స్థిరంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం దేశ రాజధానిలో లీటరు పెట్రోలు ధర రూ. 81.06కు చేరగా, గడచిన వారం రోజుల్లో 57 పైసల మేరకు ధర పెరిగింది. ఇదే సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ. 73.62 వద్ద కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధర బ్యారల్ కు 45 డాలర్లకు పైగా చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ధరలను సవరణ చేయాల్సి వచ్చిందని చమురు కంపెనీలు వెల్లడించాయి.