ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా?: నారా లోకేశ్

  • అచ్చెన్న రూపాయి కూడా అవినీతి చెయ్యలేదు
  • తెలంగాణలో అమలైన విధానాన్ని అధ్యయనం చేయమన్నారు
  • ఈ మేరకు లెటర్ రాసినందుకు అరెస్ట్ చేశాం అంటున్నారు  
ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టు చేసిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు గురించి దర్యాప్తు అధికారులు తెలిపిన పలు విషయాల గురించి 'ఆంధ్రజ్యోతి' పత్రికలో వచ్చిన వార్తను టీడీపీ నేత నారా లోకేశ్ పోస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో డీలర్ల నుంచి అచ్చెన్నాయుడికి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో ఎక్కడా బయట పడలేదని ఏసీబీ వెల్లడించినట్లు అందులో ఉంది.

ఆర్థికపరమైన లావాదేవీలపై ఆధారాలు లభించలేదని ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ పేర్కొన్నట్లు అందులో చెప్పారు. తదుపరి విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, మొత్తం వ్యవహారాన్ని వెలికితీస్తామని రవికుమార్ చెప్పినట్లు అందులో ఉంది.

రవికుమార్ చెప్పిన విషయాలను లోకేశ్ గుర్తు చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'అచ్చెన్న రూపాయి అవినీతి చెయ్యలేదు, కేవలం తెలంగాణలో అమలైన విధానాన్ని అధ్యయనం చేసి చెయ్యండి అని లెటర్ రాసినందుకు, అరెస్ట్ చేశాం అంటున్నారు అధికారులు.. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా?' అని లోకేశ్ నిలదీశారు.


More Telugu News