అన్నాడీఎంకేలో గ్రూప్ వార్.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య పోస్టర్ల చిచ్చు!
- దిండుగల్లో పోస్టర్ వార్
- వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి పన్నీర్ సెల్వమేనంటూ పోస్టర్
- సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పెరుగుతున్న దూరం
తమిళనాడులోని అధికారిక అన్నాడీఎంకేలో గ్రూపు వార్ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు చెడిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దిండుగల్లో వెలసిన పోస్టర్లు వారి మధ్య మరింత ఎడం పెంచేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. డిప్యూటీ పళనిస్వామి అంటూ ఆ పోస్టర్లలో రాసుకొచ్చారు. 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఫలానా అంటూ మంత్రులు సెల్లూరు రాజు, కేటీ రాజేంద్ర బాలాజీలు భిన్న వాదనలు తెరపైకి తేవడంతో వివాదం రాజుకుంది. నిన్న దిండుగల్లో వెలసిన పోస్టర్లు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి.