నాతో పాటు మా పాపకు, అమ్మానాన్నలకు కూడా కరోనా సోకింది: గాయని మాళవిక
- హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నాం
- చికిత్స తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం
- నా భర్త సాయం చేస్తున్నాడు
గాయని మాళవిక కరోనా బారిన పడి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. తనకే కాకుండా తన రెండేళ్ల కూతురు, తల్లిదండ్రులకి కూడా కరోనా సోకిందని ఆమె తాజాగా తెలిపింది. తన కూతురితో పాటు తల్లిదండ్రులకు కరోనా లక్షణాలు కనిపించలేదని చెప్పింది.
మొదట తనకు జలుబు, జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, దీంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆమె చెప్పింది. అనంతరం తమ కుటుంబ సభ్యులు కూడా చేయించుకోగా వారికీ కరోనా సోకినట్లు తెలిసిందని వివరించింది. తాను ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ వ్యాయామం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది.
తాము కోలుకునేందుకు తన భర్త కృష్ణ చైతన్య సాయం చేస్తున్నాడని వివరించింది. కాగా, గాయకులు బాల సుబ్రహ్మణ్యం, సునీత కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. సునీత కోలుకోగా, బాల సుబ్రహ్మణ్యం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు చాలామంది సినీ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. వారిలో కొందరు కోలుకోగా, కొందరు చికిత్స తీసుకుంటున్నారు.