ఏడేళ్ల చిన్నారికి పోలీసుల సమన్లు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం

  • శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల
  • మరమ్మతు చేయించాలన్న బాలిక విజ్ఞప్తిని పట్టించుకోని కలెక్టర్
  • హైకోర్టును ఆశ్రయించిన బాలిక
విచారణకు హాజరు కావాలంటూ ఏడేళ్ల బాలికకు తమిళనాడు పోలీసులు సమన్లు పంపడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరువళ్లూరు జిల్లాలోని మీంజూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. గోడలు బీటలు వారి ప్రమాదకరంగా మారింది. ఏ క్షణాన్నయినా కూలిపోయే ప్రమాదం ఉండడంతో ఆ పాఠశాలలో రెండో తరగతి చదువుకుంటున్న ఏడేళ్ల బాలిక ముత్తరసి స్పందించింది.

పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టాలంటూ కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులను కోరింది. బాలిక విజ్ఞప్తిని వారు పట్టించుకోకపోవడంతో తన తండ్రి సాయంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాలిక పిటిషన్‌ను విచారించిన కోర్టు పాఠశాలకు ఆరు నెలల్లో మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో స్పందించిన పోలీసులు నిన్న ఉదయం బాలికకు నోటీసులు పంపారు. మీంజూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.  





More Telugu News