ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు.. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా
- పదవి నుంచి దిగిపోవాలంటూ గత కొన్నాళ్లుగా ఆందోళనలు
- సైన్యం ఒత్తిడితో పదవులకు రాజీనామా చేసిన అధ్యక్షుడు, ప్రధాని
- భారతీయులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్న భారత రాయబార కార్యాలయం
ఆఫ్రికా దేశం మాలి అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా పదవి నుంచి వైదొలగాలంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ఆందోళనలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సైన్యం అకస్మాత్తుగా తిరుగుబాటు చేసి ఇబ్రహీంను ఇంట్లో నిర్బంధించింది. సైన్యం ఒత్తిడితో ఇబ్రహీం రాజీనామా చేయకతప్పలేదు.
అలాగే, ప్రధాని బౌబు సిస్సే కూడా తన పదవికి రాజీనామా చేశారు. సైనిక చర్యపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, మాలి పరిణామాలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమైంది. ఇదిలా ఉండగా, మాలిలో నివసిస్తున్న భారతీయులు ప్రస్తుత పరిణామాల కారణంగా ఇళ్లకే పరిమితం కావాలని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సూచించింది. అత్యవసర సాయం కోరుకునే వారు తమను సంప్రదించాలంటూ హెల్ప్‌లైన్ నంబరును ట్వీట్ చేసింది.