తిరుపతిలో రోడ్లపైకి వచ్చిన చిరుతపులి... జనాల బెంబేలు!
- జూ పార్క్ రోడ్డులోకి వచ్చిన చిరుత
- రోడ్డుపై వెళుతున్న బైకర్లపై దాడి
- పట్టుకునేందుకు అధికారుల ప్రయత్నం
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో రహదారులపై ఓ చిరుతపులి సంచరించడం, కనిపించిన వారిపై దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జూపార్క్ రోడ్ లో జరిగింది. పక్కనే ఉన్న కొండలపై నుంచి వచ్చిన చిరుత, పలువురు బైకర్లపై దాడికి దిగినట్టు తెలుస్తోంది.
బైక్ లపై వెళుతున్న వారిని అది చాలా దూరం వెంబడించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చిరుత దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. అయితే ఆ చిరుత తిరిగి అడవుల్లోకి వెళ్లిందా? లేక నగరంలోనే ఎక్కడైనా దాక్కుందా? అన్న విషయం తెలియడం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చిరుతపులి జూ పార్క్ నుంచి తప్పించుకుని వచ్చినది కాదని తెలుస్తోంది. దీన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.