ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కేరళలలోని తబ్లిగీ జమాత్ కార్యాలయాలపై ఏకకాలంలో ఈడీ దాడులు
- దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాత్ కారణమైందన్న ఆరోపణలు
- హైదరాబాద్‌లోని మూడు చోట్ల దాడులు
- విదేశాల నుంచి హవాలా మార్గంలో నిధులు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన తబ్లిగీ జమాత్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఏక కాలంలో దాడులు చేసింది. ముంబై, ఢిల్లీ, కేరళతోపాటు హైదరాబాద్ మల్లేపల్లితోపాటు పాతబస్తీలోని మరో మూడు తబ్లిగీ జమాత్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది.
ఈ ఏడాది మార్చిలో తబ్లిగీ జమాత్ దేశంలో కలకలం రేపింది. దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాత్ కారణమైందన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు మర్కజ్ చీఫ్ మౌలానాపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ఈడీ రంగ ప్రవేశం చేసింది.
ఈ సందర్భంగా జరిపిన దర్యాప్తులో ప్రపంచంలోని పలు దేశాల నుంచి తబ్లిగీ జమాత్‌కు విరాళాల రూపంలో అక్రమంగా నిధులు చేకూరినట్టు ఈడీ గుర్తించింది. దీంతో మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కింద జమాత్ చీఫ్ మౌలానా సాద్‌తోపాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఏకకాలంలో తాజాగా దాడులు నిర్వహించింది.