ఐపీఎల్ స్పాన్సర్ గా డ్రీమ్11ను ప్రకటించిన బీసీసీఐ

  • డ్రీమ్11 పేరును అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
  • ఇప్పటికే 6 ఐపీఎల్ ఫ్రాంచైజీలతో డ్రీమ్11కు అనుబంధం
  • బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపిన డ్రీమ్11
ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ గా డ్రీమ్11ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ గవర్నింగ్ బాడీ ప్రకటించింది. ముంబై కేంద్రంగా ఈ డ్రీమ్11 స్పోర్ట్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పని చేస్తోంది. ఐపీఎల్ కు చెందిన 6 ఫ్రాంచైజీలతో సహా మొత్తం 19 స్పోర్ట్ లీగ్ లతో కలసి డ్రీమ్11 పనిచేస్తోంది.

ఈ సందర్భంగా ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ మాట్లాడుతూ, ఐపీఎల్ స్పాన్సర్ గా డ్రీమ్11ను స్వాగతిస్తున్నామని చెప్పారు. అఫీషియల్ పార్టనర్ నుంచి టైటిల్ స్పాన్సర్ గా డ్రీమ్11 మారడం సంతోషకరమని తెలిపారు. డ్రీమ్11కు అంతా మంచి జరుగుతుందని ఆకాంక్షించారు.

డ్రీమ్11 సీఈవో, సహవ్యవస్థాపకుడు హర్ష్ జైన్ మాట్లాడుతూ, 2008లో ఐపీఎల్ లాంచ్ అయినప్పుడే డ్రీమ్11 అనే ఆలోచన పుట్టిందని చెప్పారు. ఇండియన్ స్పోర్ట్స్ అభిమానుల కోసమే పుట్టిన డ్రీమ్11కి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించే అవకాశాన్ని కల్పించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు.


More Telugu News