మధ్యాహ్నం తర్వాత లాభాలను కోల్పోయిన మార్కెట్లు

  • 86 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 23 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతం వరకు పుంజుకున్న టెక్ మహీంద్రా
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లన్నీ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో మన ఇన్వెస్టర్లు కూడా హుషారుగా ట్రేడింగ్ జరిపారు. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో సెన్సెక్స్ 180 పాయింట్ల వరకు పెరిగింది. అయితే, మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో లాభాలు హరించుకుపోయాయి.

ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 38,615 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 11,408 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.97%), భారతి ఎయిర్ టెల్ (1.77%), మారుతి సుజుకి (1.46%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.34%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.04%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-1.42%), ఓఎన్జీసీ (-1.36%), నెస్లే ఇండియా (-1.21%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.89%), ఇన్ఫోసిస్ (-0.81%).


More Telugu News