ముంబై పోలీసుల తీరును ప్రపంచమంతా చూస్తోంది: బీహార్ సీఎం నితీశ్ విమర్శలు

  • సుశాంత్ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు
  • సుశాంత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న నితీశ్
  • బీహార్ పోలీసుల చర్య సరైనదనే విషయం సుప్రీం తీర్పుతో అర్థమవుతోంది
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాగతించారు. సుప్రీంకోర్టే తీర్పును వెలువరించిన తర్వాత... ఈ విషయంలో మరో మాటకు తావు లేదని అన్నారు. సుశాంత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

ఏదైనా ఒక కేసుకు సంబంధించి బీహార్ పోలీసులకు ఫిర్యాదు వచ్చిన తర్వాత దర్యాప్తు చేయడం రాష్ట్ర పోలీసుల విధి అని నితీశ్ అన్నారు. అయితే, ముంబై పోలీసులు తమ పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని చెప్పారు. ముంబై పోలీసుల తీరును ప్రపంచమంతా చూస్తోందని అన్నారు. బీహార్ పోలీసుల చర్య సరైనదనే విషయం సుప్రీం తీరుతో అర్థమవుతోందని చెప్పారు. మరోవైపు, విచారణ కోసం వెళ్లిన బీహార్ ఐపీఎస్ అధికారిని ముంబైలో బలవంతంగా క్వారంటైన్ చేసి, ఆ తర్వాత వదిలిన సంగతి తెలిసిందే.


More Telugu News