చెత్త రికార్డు సృష్టించిన 'సడక్ 2' ట్రైలర్!
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో డిస్‌లైక్‌లు
- అలియా భట్, మహేశ్ భట్ వంటి వారిపై విమర్శలు
- ట్రైలర్‌కు 61 మిలియన్ల వ్యూస్
- ఏకంగా 11.65 మిలియన్ల డిస్‌లైకులు
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సినీరంగంలో బంధుప్రీతిపై తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జొహార్, అలియా భట్, మహేశ్ భట్ వంటి వారిపై అభిమానులు మండిపడ్డారు.
ఇదే సమయంలో సంజయ్ దత్, పూజా భట్, ఆదిత్యరాయ్ కపూర్, ఆలియా నటించిన ‘సడక్ 2’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ ప్రపంచంలోనే రెండో మోస్ట్ డిస్‌లైక్‌డ్ వీడియోగా చరిత్ర సృష్టించింది. ఈ ట్రైలర్‌ను ఇప్పటివరకు ఏకంగా 61 మిలియన్ల మంది చూశారు.
ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో డిస్‌లైకుల వర్షం కురిసింది. ఏకంగా 11.65 మిలియన్ల మంది ఈ వీడియోను డిస్‌లైక్ చేశారు. ఇక 18 మిలియన్ల డిస్‌లైకులతో 'యూట్యూబ్ రివైండ్ 2018: ఎవ్రీ వన్ కంట్రోల్స్ రివైండ్వీ' వీడియో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది.
రెండో స్థానంలో జస్టిన్ బీబర్ బేబీ పాట ఉంది. కాగా, 1991లో సంజయ్‌దత్, పూజా భట్ జంటగా నటించిన ‘సడక్’కు సీక్వెల్‌గా ‘సడక్ 2’ వస్తోంది. సుశాంత్ సింగ్ మీద ఉన్న జాలి, ప్రేమ కారణంగా సోషల్ మీడియాలో అలియా భట్ వంటి వారిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.