కంటికి కట్టు కట్టించుకున్న ఫొటోను పోస్ట్ చేసిన ఖుష్బూ.. షాక్ అవుతున్న నెటిజన్లు

  • నేను కొన్ని రోజులు అందుబాటులో ఉండను
  • నా కంటికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది 
  • త్వరలోనే మళ్లీ అందుబాటులోకి వస్తాను
  • బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండండి 
తాను కొన్ని రోజుల పాటు ప్రజలకు, తన అభిమానులకు అందుబాటులో ఉండబోనని తెలుపుతూ సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'హాయ్ ఫ్రెండ్స్.. నేను కొన్ని రోజులు క్రియాశీలకంగా ఉండబోను.. ఈ రోజు ఉదయం నా కంటికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. త్వరలోనే మళ్లీ అందుబాటులోకి వస్తాను' అని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.

'బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండండి.. భౌతిక దూరాన్ని పాటించండి' అని ఖుష్బూ ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా తన కంటికి కట్టు కట్టించుకున్న ఫొటో ఆమె పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫొటోను చూసిన కొందరు సినీ ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు కూడా త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో నటిస్తూనే కాంగ్రెస్‌ పార్టీలో ఆమె క్రియాశీలకంగా పనిచేస్తోన్న విషయం తెలిసిందే. 



More Telugu News