షారుఖ్ అవ‌మానించడంతో సుశాంత్ గాయ‌ప‌డ్డాడు: సునీల్‌

  • ఫిలింఫేర్ అవార్డుల సందర్భంగా సుశాంత్ ను అవమానించాడు
  • సుశాంత్ ఎంతో బాధపడ్డాడు
  • కీలక విషయాన్ని బయటపెట్టిన సుశాంత్ జిమ్ పార్ట్ నర్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఇండస్ట్రీలోని బంధుప్రీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా సుశాంత్ జిమ్ పార్ట్ నర్ సునీల్ శుక్లా మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 2013 ఫిలింఫేర్ అవార్డుల సందర్భంగా స్టేజిపై సుశాంత్ ను షారుఖ్ అవమానించాడని చెప్పారు. తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడతానని చెప్పిన షారుఖ్... దానికి విరుద్ధంగా సుశాంత్ ను అవమానించాడని అన్నారు. ఈ ఘటనతో సుశాంత్ ఎంతో బాధపడ్డాడని చెప్పారు.

మరోవైపు సుశాంత్ మరణం తర్వాత ఆయన మృతికి షారుఖ్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపిన సంగతి తెలిసిందే. సుశాంత్ తనను ఎంతో అభిమానించేవాడని, అతని ఉత్సాహం, ఎనర్జీ, నిండు నవ్వు అన్నీ మిస్ అవుతానని ట్వీట్ చేశాడు. సుశాంత్ ఆత్మకు అల్లా శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని చెప్పాడు.


More Telugu News