ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్న బెంగళూరు వైద్యుడి అరెస్ట్
- ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న వైద్యుడు
- ఉగ్రవాదులకు వైద్య చికిత్స, ఆయుధ సాయం
- 2014లో సిరియాలో పర్యటన
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)తో సన్నిహిత సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరుకు చెందిన వైద్యుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. అబ్దుర్ రెహమాన్ (28) అనే వైద్యుడు నగరంలోని ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులకు అతడు వైద్య, ఆయుధ సాయం అందిస్తున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. ఉగ్రవాద సంస్థతో తనకు సంబంధాలున్న విషయాన్ని అతడు అంగీకరించాడని అధికారులు తెలిపారు.
దాడుల్లో గాయపడిన ఐసిస్ కార్యకర్తల కోసం అబ్దుర్ రెహమాన్ ఓ మెడికల్ అప్లికేషన్ తయారు చేస్తున్నాడని, ఆయుధాలను సరఫరా చేసే విషయంలోనూ ఆయన హస్తం ఉన్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. 2014లో సిరియాలో పర్యటించిన అబ్దుర్ రెహమాన్ గాయపడిన ఉగ్రవాదులకు వైద్య సాయం కూడా అందించినట్టు అధికారులు పేర్కొన్నారు.