దేశంలో కరోనా కేసులు మూడు లక్షలు దాటిన మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డు: దేవినేని ఉమ విమర్శలు
- 11 రోజుల్లోనే ఏపీలో కొత్తగా లక్ష కేసులు
- 3,06,261 కేసులు, 2,820 మరణాలు
- దేశంలో 10 వేల కేసులు దాటిన 50 జిల్లాల్లో 13 మనవే
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 11 రోజుల్లోనే ఏపీలో కొత్తగా లక్ష కేసులు నమోదుకావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మూడు లక్షల కేసులు దాటిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు నమోదు చేసిందని విమర్శలు గుప్పించారు. ఇందుకు సంబంధించిన ఓ న్యూస్ చానెల్లో వచ్చిన సమాచారానికి సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవట్లేదని ఆయన విమర్శించారు.
'3,06,261 కేసులు, 2,820 మరణాలు. దేశంలో మూడు లక్షల కేసులు దాటిన మూడో రాష్ట్రంగా రికార్డు. 11 రోజుల్లోనే మూడో లక్ష కూడా.. కేసుల పెరుగుదలలో మొదటిస్థానం. దేశంలో 10 వేల కేసులు దాటిన 50 జిల్లాలలో 13 మనవే. కరోనా వారియర్స్ తో మాట్లాడి ప్రజలకు మనో ధైర్యం కల్పించాలన్న చంద్రబాబు నాయుడి గారి మాటలు మీకు వినబడుతున్నాయా.. జగన్ గారు?' అని దేవినేని ఉమా మహేశ్వరరావు ట్విట్టర్లో ప్రశ్నించారు.