కడప సెంట్రల్ జైలులో కరోనా విజృంభణ... జేసీ ప్రభాకర్ రెడ్డికి సోకిన మహమ్మారి!
- 700 మంది నమూనాలకు పరీక్షలు
- 303 మంది ఖైదీలకు, 14 మంది సిబ్బందికి పాజిటివ్
- తాడిపత్రి, అనంతపురంలో అదనపు బలగాలు
కడప సెంట్రల్ జైలుపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. జైలులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు, రిమాండ్ ఖైదీలలో చాలా మందికి వైరస్ సోకింది. జైలులోని ఖైదీలు, సిబ్బంది సహా మొత్తం 700 మంది నమూనాలను పరీక్షించగా, 303 మంది ఖైదీలు, 14 మంది సిబ్బంది, అధికారులకు వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది.
కరోనా సోకిన వారిలో, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత, ఇటీవల ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. వైరస్ పాజిటివ్ వచ్చిన వారందరినీ వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించామని, వారికి చికిత్సను అందిస్తున్నామని జైలు సూపరింటెండెంట్ నాయక్ వెల్లడించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిందని తెలియడంతో తాడిపత్రి, అనంతపురం ప్రాంతంలో పోలీసు బందోబస్తును పెంచారు.