సింగపూర్, ఇండోనేషియాలలో ఒకే సమయంలో, ఒకే తీవ్రతతో భారీ భూకంపం
- ఈ తెల్లవారుజామున 3.59 గంటలకు భూ ప్రకంపనలు
- రెండు చోట్లా 6.9 తీవ్రతతో భూకంపం
- వెల్లడించిన భారత జాతీయ భూకంప అధ్యయన కేంద్రం
సింగపూర్‌లో ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకారం.. సింగపూర్‌కు 554 కిలోమీటర్ల దూరంలో దక్షిణ నైరుతి ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 3.59 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భూమికి 115 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
సరిగ్గా అదే సమయంలో ఇండోనేషియాలోనూ అదే తీవ్రతతో భూకంపం సంభవించింది. జకార్తాకు పశ్చిమ వాయవ్యంగా 623 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు భారత జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. తెల్లవారుజామున 3.59 గంటలకు భూమికి 40 కిలోమీటర్ల లోతున 6.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తెలిపింది.