10 పురాతన పెట్టెల్లో 15 కిలోల బంగారం... అనంతపురం జిల్లాలో గుప్త నిధి స్వాధీనం!
- అనంతపురం జిల్లాలో ఘటన
- నాగలింగ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు
- ట్రెజరీ అధికారి, అతని డ్రైవర్ ప్రమేయం ఉన్నట్టు అనుమానం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ డ్రైవర్ ఇంట్లో తవ్వకాలు జరిపిన పోలీసులు భారీ ఎత్తున దాచివుంచిన గుప్త నిధిని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే, నాగలింగ అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చిన పోలీసులు, తవ్వకాలు ప్రారంభించారు.
ఆపై 10 పురాతన ట్రంకు పెట్టెలు లభించగా, అందులో 15 కిలోల బంగారం ఉంది. దాన్ని కవర్ చేసేందుకు మీడియాను పోలీసులు అనుమతించలేదు. ట్రెజరీ ఆఫీసులో పనిచేస్తున్న మనోజ్ అనే అధికారి వద్ద నాగలింగ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్, నాగలింగలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ బంగారం విషయంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతుండగా, నేడో, రేపో పోలీసుల నుంచి ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఇంట్లో తవ్వకాల్లో బంగారం దొరికిన ఘటన ఈ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశం అయింది. ఇది హవాలా బంగారమని, ఓ ప్రముఖ నేత బినామీ బంగారమని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కాగా, బాలప్ప ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, సోదాలకు వెళితే, బంగారం దొరికిందని, ఈ విషయంలో లోతుగా విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.