చెన్నైలో చికిత్స పొందుతూ టీటీడీ అధికారి కన్నుమూత
- కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మహేశ్వరరావు
- రెండ్రోజుల కిందట కరోనా నెగెటివ్
- అంతలోనే పరిస్థితి విషమం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అసిస్టెంట్ విజిలెన్స్-సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న వి.మహేశ్వరరావు మరణించారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మహేశ్వరరావు జూలై 28 న కరోనా లక్షణాలతో చెన్నై ఆసుపత్రిలో చేరారు.
రెండ్రోజల కిందట నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ అని రావడంతో, ఆయన త్వరలోనే డిశ్చార్జి అయి, విధుల్లో చేరతారని టీటీడీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. కానీ ఆలయ వర్గాల్లో విషాదం నింపుతూ ఆ అధికారి మృతి చెందారు. మహేశ్వరరావు మృతిపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చీఫ్ విజిలెన్స్-సెక్యూరిటీ ఆఫీసర్ జెట్టి గోపీనాథ్, ఇతర అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.