చాలాచోట్ల అగ్నిప్రమాదాలు జరిగినా ఇంతలా వేధింపులు లేవు: డాక్టర్ రాయపాటి శైలజ
- స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు
- డాక్టర్ శైలజను ప్రశ్నించిన విజయవాడ పోలీసులు
- కులం పేరుతో దుష్ప్రచారం చేయడం బాధగా ఉందన్న శైలజ
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి డాక్టర్ రాయపాటి శైలజను పోలీసులు విచారించారు. గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో ఆమెను విజయవాడ పోలీసులు విచారించారు. శైలజ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడి కుమార్తె అని తెలిసిందే. ఈ సందర్భగా డాక్టర్ శైలజ పోలీసుల విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
"కొవిడ్ సెంటర్లను ఎప్పుడైనా సందర్శించారా? అని పోలీసులు అడిగారు. నేను గత ఏడెనిమిది నెలలుగా వైద్య వృత్తిలో లేనని చెప్పాను. నా పుట్టుపూర్వోత్తరాల గురించి అడిగారు. అన్నింటికీ సమాధానం చెప్పాను.
స్వర్ణప్యాలెస్ ఘటన అనుకోకుండా జరిగింది. పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తేనే డాక్టర్ రమేశ్ కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ప్రైవేటు కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. చాలాచోట్ల అగ్నిప్రమాదాలు జరిగినా ఇంతలా వేధింపులు లేవు. 30 ఏళ్లుగా తెచ్చుకున్న పేరుప్రతిష్ఠలను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. కులం పేరుతో దుష్ప్రచారం చేయడం బాధగా ఉంది. రమేశ్ బాబును రమేశ్ చౌదరిగా ప్రచారం చేయడమే దీనికి నిదర్శనం. న్యాయం మావైపు ఉంది, త్వరలోనే అన్ని ఇబ్బందులను అధిగమిస్తాం" అంటూ ధీమా వ్యక్తం చేశారు.