హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ!
- ఇళ్ల పట్టాల పంపిణీ అంశంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు
- యూనివర్శిటీలు, కాలేజీలు, పాఠశాలలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని ఆదేశం
- తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా
ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అంశంలో హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. యూనివర్శిటీలు, కాలేజీలు, పాఠశాలలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, విశాఖలోని తిరుమలగిరి గిరిజన పాఠశాల స్థలాన్ని ఇళ్ల పట్టాలుగా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
వాస్తవానికి ఆగస్ట్ 15వ తేదీన ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, పట్టాల కేటాయింపుల్లో పలు అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.