రేపు మాధవన్ తో ఈ సన్నివేశం ఉందని చెప్పారు.. చాలా టెన్షన్ పడ్డాను: బిపాసా బసు

  • మాధవన్ నాకు మంచి మిత్రుడు
  • ఆయనతో కిస్సింగ్ సీన్ ఉందని చెప్పగానే గుండెపోటు వచ్చినంత పనైంది
  • నా టెన్షన్ చూసి అందరూ నవ్వుకున్నారు
బాలీవుడ్ లో అత్యంత క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో బిపాసా బసు ఒకరు. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి, బాలీవుడ్ లో తన సొంత టాలెంట్ తో ఆమె నిలబడ్డారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బెంగాలీ భామ... రొమాంటిక్ సన్నివేశాలతో సైతం కుర్రకారును ఉర్రూతలూగించింది. అధర చుంబనాలకు కూడా  ఆమె వెనుకాడలేదు. ఎన్నో లిప్ లాక్ సీన్లలో నటించిన ఆమె... ఒక హీరోతో మాత్రం ఆ సన్నివేశం ఉందని చెప్పగానే చాలా టెన్షన్ పడ్డారట. ఆయన మరెవరో కాదు... దక్షిణాది అందగాడు మాధవన్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిపాసా మాట్లాడుతూ... గతంలో జరిగిన ఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు. మాధవన్ తో కలిసి బిపాసా 'జోడి బ్రేకర్స్' అనే సినిమాలో నటించారు. ఆ చిత్రంలో ఇద్దరి మధ్య అధరచుంబన సన్నివేశం ఉంది. దీనిపై ఆమె మాట్లాడుతూ, మాధవన్ తనకు మంచి మిత్రుడని... అయితే, మరుసటి రోజు షూటింగ్ లో కిస్ సీన్ ఉందని తనకు చెప్పంగానే  చాలా టెన్షన్ పడ్డానని చెప్పారు. తనకు గుండెపోటు వచ్చినంత పనైందని తెలిపారు. చివరికి ఎలాగోలా ఆ సీన్ ను పూర్తి చేశానని చెప్పారు. తన టెన్షన్ ను చూసి మాధవన్ తో పాటు సెట్లో ఉన్న అందరూ నవ్వుకున్నారని తెలిపారు.

మరోవైపు, బాలీవుడ్ హీరో కరన్ సింగ్ గ్రోవర్ ను 2016లో బిపాసా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ 'అలోన్' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అంతకు ముందు ఆమె బాలీవుడ్ నటులు డినో మోరియా, జాన్ అబ్రహంలతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి.


More Telugu News