అది నిజం కాదు.. నాన్న ఇంకా వెంటిలేటర్ మీదే వున్నారు.. క్లారిటీ ఇచ్చిన బాలు తనయుడు!

  • నాన్న ఆరోగ్యం నిన్నటి మాదిరే ఉంది
  • వెంటిలేటర్ తీయలేదు
  • అందరి ప్రార్థనలతో ఆయన కోలుకుంటారు
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గానగాంధర్వుడిగా పేరుగాంచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని ఆసుపత్రి వర్గాలు కూడా ఒక బులెటిన్ రూపంలో వెల్లడించాయి. దీంతో, ఆయన అభిమానులందరూ తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో, ఆయన కుమారుడు చరణ్ ఒక వీడియో విడుదల చేశారు.

'నాన్న ఆరోగ్య పరిస్థితి నిన్న ఏవిధంగా ఉందో... ఈరోజు కూడా అదే మాదిరి ఉంది. నాన్నకు వెంటిలేటర్ తీసేశారనే ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. ఆయన వెంటిలేటర్ మీదే ఉన్నారు. ఆయన కోలుకుంటారనే నమ్మకం మాకు ఉంది. ఒక మెడికల్ టీమ్ ఆయనకు చికిత్స అందిస్తోంది. వారందరూ నాన్న ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాన్న కోలుకోవాలనే అందరి ప్రార్థనలు ఫలిస్తాయి. ఒక కుటుంబంగా మనందరి ప్రార్థనలు ఫలించి, ఆయన కోలుకుంటారు' అని బాలు కుమారుడు తెలిపారు.


More Telugu News