బిగ్ న్యూస్ అనగానే... మీరు అలా ఫిక్స్ అయిపోతారా?: సందీప్ కిషన్

  • హీరోగా బిజీగా ఉంటూనే నిర్మాతగా వ్యవహరిస్తున్న సందీప్
  • అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానన్న యువ హీరో
  • ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ
తెలుగు సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. హీరోగా రాణిస్తూనే రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సొంతంగా వెంకటాద్రి టాకీస్ అనే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్నాడు. సందీప్ లో సమాజానికి ఏదో చేయాలనే స్పృహ కూడా ఎక్కువే. పబ్లిసిటీకి తావు ఇవ్వకుండా తన వంతుగా ప్రజల కోసం సహాయక కార్యక్రమాలను కూడా చేపడుతుంటాడు. ప్రస్తుతం 'ఏ1 ఎక్స్ ప్రెస్' అనే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సందీప్... 'వివాహ భోజనంబు' అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు.

అయితే, ఈ సినిమా ప్రకటనకు ముందు... బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నా, అందరూ సిద్ధంగా ఉండండి అని సందీప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. అయితే, ఇప్పుడు టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది కదా. అందుకే అందరూ మనోడు పెళ్లి గురించి అనౌన్స్ చేస్తాడని భావించారు. దీనిపై తాజాగా సందీప్ క్లారిటీ ఇచ్చాడు. బిగ్ న్యూస్ అనగానే అందరూ పెళ్లి అని ఫిక్స్ అయిపోతారా? అని సరదాగా ప్రశ్నించాడు. మీ అందరికీ చెప్పే కదా నేను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అని ప్రశ్నించాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని తెలిపాడు.


More Telugu News