గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

  • భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి
  • ఉభయ గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితులు
  • నీట మునిగిన వేలాది ఎకరాలు
ఉభయ గోదావరి జిల్లాలు వరద బారిన పడిన నేపథ్యంలో సీఎం జగన్ ఈ మధ్యాహ్నం ఏరియల్ సర్వే నిర్వహించారు. గోదావరి బీభత్సం సృష్టించిన తీరును ఆయన హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన సీఎం పంట పొలాలు నీట మునిగిన దృశ్యాలను వీక్షించారు. సీఎం వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, అధికారులు కూడా ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. కాగా, వరద బాధితులకు సీఎం జగన్ రూ.2 వేల చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు.



More Telugu News