కేంద్రం, రాష్ట్రం తప్పుకుంటే రైతన్నకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చుతారు?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఫసల్ బీమా పథకంపై ఉత్తమ్ ఆవేదన
  • కేంద్రం తన వాటాను తగ్గించుకుందని వెల్లడి
  • రాష్ట్రం పూర్తిగా మంగళం పాడేసిందని విమర్శలు
రైతులకు ఉపయుక్తంగా వుండే 'ప్రధాని ఫసల్ యోజన' పథకంలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుందన్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఫసల్ బీమా పథకంలో తన వాటాను తగ్గించుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని, కేసీఆర్ ప్రభుత్వం మొత్తానికే మంగళం పాడేసిందని విమర్శించారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం పరస్పర బాధ్యతల నుండి తప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. భారీ వర్షాలతో రైతన్నకు జరిగిన తీవ్ర నష్టాన్ని ఎవరు పూడ్చుతారు? అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు.

కాగా ఓ పత్రికలో ఇదే అంశంపై బీమా... పాయె అంటూ కథనం వెలువరించారు. కేంద్ర సర్కారు తన వాటా తగ్గించుకుందని, బీమా పథకానికి ప్రీమియం కట్టడం భారమని రాష్ట్ర ప్రభుత్వం పథకాన్నే నిలిపివేసిందని, ప్రీమియం చెల్లించలేక పిట్టకథలు చెబుతున్నారంటూ  ఆ కథనంలో పేర్కొన్నారు. ఆ కథనం తాలూకు క్లిప్పింగ్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ట్వీట్ కు జోడించారు.


More Telugu News