క్రిష్ తాజా చిత్రానికి కీరవాణి మ్యూజిక్!
- గతంలో క్రిష్, కీరవాణి కాంబోలో 'వేదం'
- వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా క్రిష్ తాజా చిత్రం
- రొమాంటిక్ మూవీ కావడంతో కీరవాణి ఎంపిక
సంగీత దర్శకుడు కీరవాణి, క్రిష్ కలయికలో గతంలో 'వేదం' సినిమా వచ్చింది. అందులోని పాటలు బాగా హిట్టయ్యాయి. ముఖ్యంగా 'ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..' పాట అయితే సూపర్ హిట్. అలాంటి ఈ కాంబినేషన్ మరోసారి జతకడుతోంది. ఇటీవలే క్రిష్ తన దర్శకత్వంలో ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇందులో హీరో. ఇక ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఇటీవలే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తాజాగా కీరవాణిని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది రొమాంటిక్ మూవీ కావడంతో సంగీతానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో కీరవాణిని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్'కు కీరవాణి మ్యూజిక్ ఇస్తోన్న విషయం విదితమే.