ఫోన్ ట్యాపింగ్ పై సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయరు?: డీజీపీని ప్రశ్నించిన వర్ల రామయ్య
- ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ రగడ
- ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు
- ఈ నేపథ్యంలో చంద్రబాబుకు లేఖ రాసిన ఏపీ డీజీపీ
- డీజీపీ తీరు అభ్యంతరకరమన్న వర్ల రామయ్య
ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగింది. విపక్షనేతలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే. దీనిపై స్పందించిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు.
అయితే, చంద్రబాబుకు ఏపీ డీజీపీ లేఖ రాయడం పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. డీజీపీ తీరు అభ్యంతరకరం అని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సాక్ష్యం ఇస్తేనే దర్యాప్తు చేస్తామన్నట్టు అనడం సరికాదని తెలిపారు. చంద్రబాబు లేఖ, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయరు అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడంలేదని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు.