ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌ షా

  • కొవిడ్ సోకడంతో గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో అమిత్‌ షా
  • ఆగస్టు 14న డిశ్చార్జ్
  • ఇంటి నుంచి ఎయిమ్స్‌కు  తరలింపు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో రెండు వారాలుగా చికిత్స అందించారు. ఇటీవలే తనకు నెగెటివ్‌ వచ్చిందని, అందుకు ఈశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అమిత్ షా ప్రకటన కూడా చేశారు. ఆగస్టు 14న ఆయన ఆ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేవరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు.

అయితే, ఆయన గత మూడు నాలుగు రోజులుగా అలసట, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో చేర్చారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఆయనకు చికిత్స అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.


More Telugu News