దేశంలో 27 లక్షలు దాటిన కరోనా కేసులు
- 55,079 మందికి కొత్తగా కరోనా
- మృతుల సంఖ్య మొత్తం 51,797
- 6,73,166 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
- కోలుకున్న వారు 19,77,780 మంది
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. భారత్లో 24 గంటల్లో 55,079 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 876 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,02,743కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 51,797 కి పెరిగింది. ఇక 6,73,166 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 19,77,780 మంది కోలుకున్నారు.
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,09,41,264 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,99,864 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.